చెన్నూరు పోలీష్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
చెన్నూరు సాక్షర : చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారుపట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ బన్సీలాల్ పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, కేసుల దర్యాప్తు ప్రక్రియతో పాటు కీలక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుని, వారి సేవలను వివరించారు. కార్యక్రమం ద్వారా విద్యార్థులు పోలీసు వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ కార్యక్రమం లొ చెన్నూరు పోలీసులు విద్యార్థులు పాలొగొన్నారు
