📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

12 ఏళ్లుగా నరకయాతన … కిడ్నీ మార్పిడి తర్వాత ఆర్థికంగా చితికిన నిరుపేద కుటుంబం

◉ Kotha Venugopal   |   ◷ Latest
12 ఏళ్లుగా నరకయాతన … కిడ్నీ మార్పిడి తర్వాత ఆర్థికంగా చితికిన నిరుపేద కుటుంబం
జన్నారం సాక్షర
జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన సేపూరి గోపాల్ గత 12 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆశతో గల్ఫ్ దేశమైన మస్కట్‌కు వెళ్లి పనిచేసిన ఆయన, అక్కడ అధిక పని ఒత్తిడి, తాగునీటి సమస్యలు తదితర కారణాలతో కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు.2014 నుంచి 2020 వరకు ప్రతి నెల సుమారు రూ.10 వేల విలువైన మందులు వాడుతూ చికిత్స పొందారు. అయినప్పటికీ వ్యాధి తీవ్రం కావడంతో 2020 నుంచి 2026 వరకు ప్రతిరోజూ డయాలసిస్‌పై ఆధారపడి జీవనం సాగించారు. కిడ్నీ మార్పిడి కోసం 2023లో జీవన్‌దాన్‌ పథకంలో నమోదు చేసుకోగా, ఎట్టకేలకు 2026 అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.ఒకవైపు ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాటం, మరోవైపు కుటుంబ పోషణ, ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అప్పులు చేసి జీవనం సాగిస్తున్న గోపాల్, 2022లో చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని దానిపైనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.కిడ్నీ మార్పిడితో గోపాల్‌కు కొత్త జీవితం లభించినప్పటికీ, ఆర్థికంగా ఆ కుటుంబం ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. చికిత్సకు చేసిన అప్పులు, ప్రస్తుత వైద్య ఖర్చులు ఆ కుటుంబానికి భారంగా మారాయి. ఈ క్లిష్ట సమయంలో దాతల సహకారం ఆ కుటుంబానికి ఎంతో అవసరం.మానవత్వం ఉన్న దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, గల్ఫ్ ప్రవాస భారతీయులు, దాతృత్వ హృదయాలు కలిగిన ప్రతి ఒక్కరూ స్పందించి తమకు తోచిన ఆర్థిక సహాయం అందించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము.మీరు అందించే ఆర్థిక సహాయం గోపాల్ కుటుంబానికి ఎంతో విలువైన సహాయం. మీ చిన్న చేయూత ఒక నిరుపేద కుటుంబానికి పెద్ద భరోసా కాగలదు.ఆర్థిక సహాయం పంపించవలసిన వివరాలు:PhonePe / Google Pay: 9999753990