కడెం మండలంలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 340 మందికి పైగా బీఆర్ఎస్‌లో చేరిక.......... కండువాలు కప్పి ఆహ్వానించిన ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్......
ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కడెం మండలం కొండుకూర్‌లోని ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న రైతు గర్జన సభను విజయవంతం చేయాలని నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు,రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభలో పాల్గొనాలని కోరారు.ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ నాయకత్వానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రైతుల సమస్యలను వినిపించేందుకు నిర్వహిస్తున్న రైతు గర్జన సభకు పెద్ద సంఖ్యలో తరలివస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడెం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
