📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

మారుమూల గిరిజన గూడెంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
మారుమూల గిరిజన గూడెంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.
  • పేద కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్న ఎంబడి రాజేశ్వర్ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు టపాసులు, స్వీట్లు పంపిణీ....
నిర్మల్ నవంబర్ 9 సాక్షర ప్రతినిధి జిల్లా సారంగాపూర్ మండలం పెండల్‌దరి గిరిజన గ్రామంలో దీపావళి పండుగను పేద కుటుంబాల మధ్య ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ గ్రామాన్ని సందర్శించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి,లబ్ధిదారులకు టపాసులు,స్వీట్లు పంపిణీ చేశారు.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంబడి రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎంబడి రాజేశ్వర్ మాట్లాడుతూ........ ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూసిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కల సాకారం కావడం ఎంతో సంతోషకరమన్నారు. పేదల గడపల్లో దీపాల వెలుగులు నిండడం,వారి కుటుంబాల్లో పండుగ ఆనందం వెల్లివిరియడం ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వారి సంతోషాల్లో భాగస్వాములవడం కూడా ప్రజాప్రతినిధులు, నాయకుల బాధ్యత అని అన్నారు.పట్టణాలకు, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న మారుమూల గిరిజన గ్రామానికి వెళ్లి పేద కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం అక్కడి ప్రజల్లో ఆనందాన్ని నింపింది. ఇందిరమ్మ ఇళ్లలో వెలిగిన దీపాల కాంతులతో గిరిజన గూడెంలో దీపావళి వేడుకలు సందడిగా సాగాయి.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్‌బాయ్, సారంగాపూర్ సర్పంచ్ భూమన్న, డాక్టర్ సెల్ నాయకులు డాక్టర్ ప్రవీణ్ కుమార్,మాజీ మండల అధ్యక్షుడు బొల్లోజు నరసయ్య, కొత్తకాపు పోతారెడ్డి, రాజేశ్వర్ రావు, బట్టు భోజన్న, జిల్లా కార్యదర్శి ఎంబడి రాకేష్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నాగరావు దంపతులు, గంగారం, శంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.