📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా డి. వెంకట మాధవ రావు బాధ్యతల స్వీకరణ

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా డి. వెంకట మాధవ రావు బాధ్యతల స్వీకరణ
  • కలెక్టర్ భవేశ్ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అదనపు కలెక్టర్.. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించిన కలెక్టర్
నిర్మల్, అక్టోబర్ 16: జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా డి. వెంకట మాధవ రావు శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా నూతన అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డి. వెంకట మాధవ రావుకు పలువురు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.