- ఆర్వో బీ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకూ మల్లు భట్టి ఆదేశాలు
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 29: నిజామాబాద్‌లోని మాధవ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (RoB) పూర్తి చేయడానికి రూ. 8.68 కోట్ల అదనపు పరిపాలనా మంజూరు ఇవ్వవలసిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ని కలిసి, అభ్యర్థించగా సానుకూలంగా స్పందించారని ఎంపి ధర్మపురి అరవింద్ తెలిపారు. నిజామాబాద్‌లోని మాధవ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (RoB) పూర్తి చేయడానికి రూ. 8.68 కోట్ల అదనపు పరిపాలనా మంజూరు విషయమై ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చానని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి తన అభ్యర్థనకు చాలా సానుకూలంగా స్పందించి, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోబి నిర్మాణ పనులు నిధులు లేక అర్ధాంతరంగా నిలిచి పోవడంతో నిజాంబాద్ నగర ప్రజలకు వివాహనదారులకు నిత్యం రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయంలో త్వరగా స్పందించాలని ఎంపీ మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమే స్పందించి సత్వరమే నిధుల మంజూరుకు పనులు పూర్తి చేయాలని ఆదేశించడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer