దుర్గామాతనిమజ్జనకార్యక్రమాన్ని ప్రశాంతగా నిర్వహించాలి చెన్నూర్ పట్టణ సిఐ బన్సీలాల్
అలాగే, ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయంకలగకుండా పోలీసుల సూచనలను పాటించాలని, డీజేలు మరియు సౌండ్ సిస్టమ్‌లను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదని సూచించారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, గొడవలకు దిగడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, పరస్పర సహకారంతో, శాంతియుతంగా నిర్వహించుకొని పోలీసులకు సహకరించాలని చెన్నూర్ పట్టణ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎసై శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది చెన్నూరు దుర్గా మాత ఉత్సవ సమితి సభ్యులు, దుర్గ మాత మండప ఆర్గనైజర్స్ పాల్గొన్నారు.
