📅 Wednesday, 28 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
27°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS భైంసా సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2040 నాటి అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక
‹
›
District News

రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి సీపీ అంబర్ కిషోర్ ఝా

◉ Kodishetti Sathish   |   ◷ Latest
రక్తదానం ప్రాణదానంతో సమానం 

ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి

 సీపీ అంబర్ కిషోర్ ఝా
చెన్నూరు సాక్షర :పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌ జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రక్తదానం చేసిన ఎస్ఐ భూమేష్ , పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించిన రక్తం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూఅవగాహనపెంపొందించుకుని, అవసరమైన సందర్భాల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా అర్హులైన వారుక్రమంతప్పకుండాస్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో జైపూర్ ఎ సి పి వెంకటేశ్వర్లు, జైపూర్ సిఐ నవీన్ కుమార్ ఎస్సై భూమేష్ ప్రజా ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు