- పాదయాత్రను విజయవంతం చేయాలి.. బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేయాలి: బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్
నిర్మల్, అక్టోబర్ 28 (సాక్షర ప్రతినిధి):“ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం!” అనే నినాదంతో నవంబర్ 3న నిర్మల్‌లో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ పిలుపునిచ్చారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న ఈ పాదయాత్రకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.మహా పాదయాత్ర ఏర్పాట్లు, కార్యక్రమ కార్యాచరణపై బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన చర్చించారు. బూత్ అధ్యక్షులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పాదయాత్రలో ప్రజలను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మేడిసెమ్మె రాజు, సాదం అరవింద్, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజి నరేష్, జింక సురేందర్, ఈశ్వర్, అర్జున్ వోడిసేల, కూన శశాంక్, సాత్విక్, సూరజ్ నాయక్, మాజీ కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, నాయకులు కందుల హరీష్, భరత్, స్వాప్నిక్, నేరేళ్ల సాయి, జాప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer