📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

బాసరలో అక్రమంగా ఆక్రమించిన దుకాణాలను తొలగించాలి.......

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
బాసరలో అక్రమంగా ఆక్రమించిన దుకాణాలను తొలగించాలి.......
  • టెండర్ల ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు షాపులు కేటాయించాలి.. గ్రామపంచాయతీ కార్యదర్శికి యువకుల వినతిపత్రం
నిర్మల్ నవంబర్ 9 సాక్షర ప్రతినిధి.
బాసర మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు, పంచాయతీ ఆవరణలో, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను కొందరు అక్రమంగా ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, మరికొందరు వాటిని ఇతరులకు అద్దెకు ఇస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని గ్రామానికి చెందిన యువకులు ఎన్. యోగేష్, బాశెట్టి రాకేష్ తదితరులు ఆరోపించారు.ఈ మేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసాద్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీకి చెందిన దుకాణాలన్నింటినీ అధికారులు తక్షణమే తమ ఆధీనంలోకి తీసుకోవాలని, నిబంధనల ప్రకారం పారదర్శకంగా టెండర్లు నిర్వహించి గ్రామానికి చెందిన నిరుద్యోగ యువతకు దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇలా చేయడం ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.తమ వినతిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగ యువతను ఏకం చేసి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.