📅 Tuesday, 03 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS జిల్లా యువజన ఉత్సవాల్లో యువత ప్రతిభకు వేదిక
‹
›
District News

వేసవిలో నిర్మల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
వేసవిలో నిర్మల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
  • వేసవిలో నిర్మల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
నిర్మల్ నవంబర్ 3(సాక్షర ప్రతినిధి) రానున్న వేసవిలో నిర్మల్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికతో అవసరమైన చర్యలు చేపడుతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి అవసరాలు అధికమయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పట్టణానికి తాగునీరు సరఫరా చేసే ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టును ఆయన అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను పరిశీలించి, రానున్న వేసవిలో పట్టణానికి తాగునీటి సరఫరా ఏ విధంగా కొనసాగించాలనే అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టాన్ని పరిశీలిస్తే నిర్మల్ పట్టణ ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు లేవని, వేసవి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు. అనుకోని పరిస్థితుల్లో నీటి నిల్వలు తగ్గినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని వైస్ చైర్మన్ కోరారు. తాగునీటి పైపులైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపు గోపి, పెండం శ్రీనివాస్, నాందేడపు చిన్ను, రఫీ, చెనిగరపు నరేష్,జాకీ, శ్రీకాంత్ యాదవ్, డీఈ హరిభువన్ తదితరులు పాల్గొన్నారు.