📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

సంస్కృతి సంప్రదాయాలే మనకు శ్రీరామరక్ష సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఏం ఎల్ ఏ

◉ Kotha Venugopal   |   ◷ Latest
సంస్కృతి సంప్రదాయాలే మనకు శ్రీరామరక్ష సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఏం ఎల్ ఏ
జన్నారం సాక్షర
తెలంగాణా రాష్ట్రంలోని సంస్కృతి సంప్రదాయాలే మనకు శ్రీరామరక్ష అని ఖానాపూర్ శాసనసబ్యులు వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలకేంద్రంలో పోనకల్ గ్రామ పంచాయితి అద్వర్యంలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ సంబరాలలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలకేంద్రానికి సమీపంలోని వాగు వద్ద పోనకల్ జి పి అద్వర్యంలో బారీ భతుకమ్మను ఏర్పాటుచేసి విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా వేదికను ఏర్పాటుచేశారు. పంచాయితీలోని మహిళలు అందరు సామూహికంగా వారి వారి ఇంటివద్ద వీదులలో దేవాలయాలలో సద్దుల బతుకమ్మ ఆటలు ఆడిన తరువాత ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాంగణంలో అందరు కలిసి సముహికంగా సద్దుల బతుకమ్మ దాండియా కోలాటాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన ఏం ఎల్ ఏ మాట్లాడుతూ పూలతో నిర్వహించే ఈ పూల పండుగ తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని సామూహికంగా ప్రతి ఒక్కరు సంబరంగా సంతోషంగా 9 రోజుల పాటు జరుపుకునే ఏకైక పూల పండుగ ఈ సద్దుల బతుకమ్మ అని అయన అన్నారు. తెలంగాణ ఆడపడుచుల సౌకర్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఇక్కడ ఈ విదంగా వేదికను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మాబూమేష్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉప సర్పంచ్ అప్పాల జలపతి పార్టి మండలశాఖ అద్యక్షులు అజ్మీర నందునయాక్ ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం పట్టణ అద్యక్షులు మంద రాజేష్ జన్నారం మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు సయ్యద్ ఫసివుల్ల నాయకులు మల్క లక్ష్మణ్ హేమంత్ చారి తదితరులు పాల్గొన్నారు.