- రమణారెడ్డి స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు.
రెబ్బెన,సాక్షర:మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లో శుక్రవారం అమరజీవి కామ్రేడ్ పి.రమణారెడ్డి 32వ వర్ధంతి వేడుకలను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి)గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)గోలేటి పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా నాయకులు,కార్యకర్తలు రమణారెడ్డి స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ పి.రమణారెడ్డి సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ కోసం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రాణం ఉన్నంతవరకు అలుపెరగని పోరాటాలు చేశారని కొనియాడారు.కార్మిక లోకానికి ఆయన అందించిన సేవలు,చూపిన పోరాట మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని,ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బద్రి సత్యనారాయణ,మండల కార్యదర్శి రాయిళ్ల నర్సయ్య,సహాయ కార్యదర్శి బి.జగ్గయ్య,గోలేటి సహాయ కార్యదర్శి జాడి సాయి,గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేషశైనా రావు,జూపాక రాజేష్,కే.కిరణ్ బాబు,ఆటో యూనియన్ అధ్యక్షులు తోట తిరుపతి,ప్రజా నాట్యమండలి మాజీ కార్యదర్శి,సీనియర్ నాయకులు భోగె మల్లయ్య,పొన్న శంకర్,సీనియర్ నాయకులు వి.యుగేందర్,కాంటాక్ట్ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్,యూనియన్ నాయకులు ఎం.అశోక్,మాల ఓదెలు,అల్లాడి కోటి,అనపర్తి శంకర్,అంజయ్య,రఘుపతి,తిరుమల్,దుగుట వెంకటస్వామి,నీలగిరి రాములు తోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి,మారిన వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గం రవీందర్,వార్డు మెంబర్ పూదర్ సాయి,కస్తూరి రవి,పర్వతి సాయి,బాలు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
— M VIJAYAREBBENA REPORTER