📅 Tuesday, 24 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS శ్రీ గురునానక్ దేవ్ జి బోధనలు అనుసరనీయం - సన్మార్గంలో నడచు కోవాలి - సత్యమార్గంలో జీవించాలి
‹
›
District News

మురిమడుగు లో అంజన్న అద్బుతం నేడు చందనదర్శనం తెల్లవారి నిజరూప దర్శనం

◉ Kotha Venugopal   |   ◷ Latest
మురిమడుగు లో అంజన్న అద్బుతం నేడు చందనదర్శనం తెల్లవారి నిజరూప దర్శనం
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో అద్బుతం జరిగింది ఎవరు ఉహించనివిదంగా స్వామివారు నేనున్నాను అనే సంకేతాన్ని భక్తులకు కలిగించారు. వివరాల్లోకి వెళితే గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారికి నిండుగా చందనంకలిగి భక్తులకు దర్శనం ఇస్తాడు కాని రెండు రోజుల క్రితం ఒక వానరం దేవాలయంలోకి వచ్చి స్వామివారి విగ్రహం పైన కుర్చున్నదని అప్పుడు స్వామివారు చందనంతో దర్శనం కల్పించారు తెల్లవారి ఆలయ పురోహితులు దేవాలయం తలుపులు తీయగానే స్వామివారు నిజరూపంలో దర్శనం ఇవ్వడంతో అర్చకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు దీంతో గ్రామస్తులు వచ్చి చూసేసరికి స్వామివారు నిజరూపంలో దర్శనం ఇచ్చాడు నిన్న చందనంతో వున్న స్వామివారు ఎవరు చందనం తొలగించకుండానే ఈ రోజు పూర్తి చందనం తొలగించి వుండడం ఏమిటి అని ఇదంతా శ్రీ భజరంగ భళి లీలా అని అందరు అనుకున్నారు. ఈ వార్త వ్యాపించడంతో దేవాలయానికి స్వామివారి దర్శనానికి భక్తుల్ క్యూ కడుతున్నారు. దేవుడు లేడు అనే వారికీ నాస్తిక సమాజానికి ఇది ఒక కనువిప్పు అని గ్రామస్తులు అంటున్నారు.