📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

ఎస్‌ఐఆర్‌-2026 జాబితాలో చోటు పొందని ఓటర్లకు మరో అవకాశం కల్పించాలి

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఎస్‌ఐఆర్‌-2026 జాబితాలో చోటు పొందని ఓటర్లకు మరో అవకాశం కల్పించాలి
మంచిర్యాల సాక్షర
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 జాబితాలో చోటు పొందని అర్హత గల ఓటర్లకు మరొక అవకాశం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, డూప్లికేట్ కేటగిరీలలో గుర్తించబడి, ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని ఓటర్లకు తుది ఓటరు జాబితాలో పేరు చేర్చుకునేందుకు మరో అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో అర్హులైన ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. సంబంధిత బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లను సంప్రదించి, ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి వాటిని సమర్పించే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే నివాసం మారకుండా ఉన్న ఓటర్లు సంబంధిత ప్రకటనతో పాటు ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చని, రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మారిన వారు కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గ వివరాలతో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఈ ఎస్ ఐ నెట్ యాప్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రతి అర్హులైన ఓటరుకు అవకాశం కల్పించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 21వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తెలిపారు.ఎ.ఎస్.డి.డి. కేటగిరీలలో గుర్తించబడి ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని ఓటర్లకు మరో అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనుబంధం ఎ ద్వారా ఓటర్లు తమ పేరు, ఓటరు గుర్తింపు సంఖ్య, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు తదితర సమాచారంతో కూడిన ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించాలని, అనుబంధం బి ద్వారా గతంలో ఎన్యుమరేషన్ ఫారం సమర్పించలేకపోయినా, ప్రస్తుతం అదే చిరునామాలో నివసిస్తున్న ఓటర్లు ఫారం సమర్పించలేకపోయిన కారణాన్ని వివరిస్తూ ఈ ప్రకటన పత్రాన్ని సమర్పించాలని తెలిపారు. అనుబంధం సి ద్వారా రాష్ట్రంలోనే మరో ప్రాంతానికి నివాసం మారిన ఓటర్లు తమ పాత చిరునామా, కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గ వివరాలతో పాటు నివాస ధ్రువీకరణ పత్రాన్ని జతచేసి ఈ ప్రకటన పత్రాన్ని సమర్పించాలని తెలిపారు. సంబంధిత ఈ ఆర్ ఓ/ఎ ఈ ఆర్ ఓ/బి ఎల్ ఓ అధికారులకు ఈ పత్రాలను సమర్పించవచ్చని, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో కొత్త నమోదు కోసం ఫారం-6 సమర్పించిన వారు తిరిగి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించవలసిన అవసరం లేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరుకు అవకాశం కల్పించేలా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ఈ ప్రక్రియను మీరు నేత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1.15 లక్షల మంది ఎ.ఎస్.డి.డి. ఓటర్లను గుర్తించడం జరిగిందని, సంబంధించిన జాబితాలను ఇప్పటికే సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందించడం జరిగిందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం కల్పించే ప్రక్రియపై జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, గడువు పొడిగింపు, దరఖాస్తుల సమర్పణ విధానంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎ ఎస్ డి డి జాబితాలో ఉన్న ఓటర్లను సంప్రదించి, వారికి అనుబంధ ఫారాలను అవసరాన్ని బట్టి ప్రకటన పత్రాల సమర్పణ విధానాన్ని వివరించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరుకు తుది ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.