📅 Thursday, 29 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS గోలేటి సిహెచ్పి బొగ్గు పరిశ్రమలకు ఆదర్శం.
‹
›
District News

మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, మాజీ సర్పంచ్ ఈర్ల నితీషా శ్రీకాంత్ చేతుల మీదుగా సిసి రోడ్ పనుల ప్రారంభం

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, మాజీ సర్పంచ్ ఈర్ల నితీషా శ్రీకాంత్ చేతుల మీదుగా సిసి రోడ్  పనుల ప్రారంభం
  • సృజన లక్ష్మీనగర్ ఫేజ్-1లో శంకుస్థాపన
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పరిధిలోని పటేల్‌గూడ సృజన లక్ష్మీనగర్ ఫేజ్-1లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అమీన్పూర్ మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీషా శ్రీకాంత్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ చిరకాల సమస్యను పరిష్కరిస్తూ సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక చొరవ, సహకారం, ఆదేశాలతో పాటు మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ నిరంతర కృషి, మాజీ సర్పంచ్ ఈర్ల నితీషా శ్రీకాంత్ ప్రత్యేక చొరవతో రోడ్డు పనులు మంజూరై ప్రారంభమయ్యాయని కాలనీవాసులు పేర్కొన్నారు. తమ కాలనీ అభివృద్ధికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సృజన లక్ష్మీనగర్ ఫేజ్-1 కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.