📅 Tuesday, 24 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS శ్రీ గురునానక్ దేవ్ జి బోధనలు అనుసరనీయం - సన్మార్గంలో నడచు కోవాలి - సత్యమార్గంలో జీవించాలి
‹
›
District News

జీవితభీమా కుటుంబానికి ఆర్థిక ధీమా పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ పోనకల్ లో ఇందిరమ్మ కుటుంబజీవితభీమా ప్రారంబం

◉ Kotha Venugopal   |   ◷ Latest
జీవితభీమా కుటుంబానికి ఆర్థిక ధీమా పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్  
        పోనకల్ లో ఇందిరమ్మ కుటుంబజీవితభీమా ప్రారంబం
జన్నారం సాక్షర
సమాజంలో ప్రతి కుటుంబానికి జీవితభీమా పెద్ద ఆర్థిక ధీమా అని పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ అన్నారు. మంగళవారం రోజున మండలకేంద్రమైన పోనకల్ గ్రామ పంచాయితి కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ఆన్లైన్ దరకాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక బరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఈ ఇందిరమ్మ కుటుంబ జీవితభీమా పతాకాన్ని ప్రారంబించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ పతాకాన్ని పంచాయితీలోని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని ఈ పథకంపై ఎటువంటి వివరాలు కావాలన్న ఇక్కడ మా సిబ్బంది చెప్తారని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పాల జలపతి మాజీ సర్పంచ్ జక్కు బూమేష్ పంచాయితి కార్యదర్శి రాహుల్ వార్డు సబ్యులు మల్లయ్య అంజన్న సంతోష్ మోసిన్ ఖాన్ రవి మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు సయ్యద్ ఫసివుల్ల కాంగ్రెస్ పార్టి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి పట్టణ అద్యక్షులు మంద రాజేష్ నాయకులు రజాక్ ప్రవీణ్ నర్సింగరావు రాగుల శంకర్ ప్రేంసాగర్ తదితరులు పాల్గొన్నారు.