📅 Tuesday, 03 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
25°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS జిల్లా యువజన ఉత్సవాల్లో యువత ప్రతిభకు వేదిక
‹
›
National News

స్పందన రాని అమిత్ షా రోడ్ షో

◉ ELUGU VAMSHIDHAR   |   ◷ Latest
సాక్షర,హైదరాబాద్:రాహుల్ గాంధీ ర్యాలీ దెబ్బకు అమిత్ షా హైదరాబాద్ రోడ్లపై పడి పోటీ ర్యాలీ చేశాడు. అమిత్ షా ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, ప్రజల నుంచి కూడా స్పందన రాలేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్పై ఉందని అమిత్ షా అంటున్నాడు.. కానీ బీజేపీ క్రిటికల్ ఐసీయూలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మోదీ, అమిత్ షా అనే ముసలి నక్కల పాలన పోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీ, అమిత్ షా ట్యాక్స్ కడుతున్నారా..? మీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోరు.. నిజాయితీగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డిని దింపాలని మాట్లాడుతున్నారు.. రేవంత్ రెడ్డిని దింపడం కాదు.. కేంద్రంలో మిమ్మల్ని దింపుతాం చూసుకోండని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆరు గ్యారెంటీలను మా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి పైసా సాయం కూడా చేయకుండా విమర్శలు చేస్తారా..? ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను మా ప్రజా ప్రభుత్వం ఇస్తోంది. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వరు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రధాని మోదీ నుంచి బీజేపీ ఎంపీల వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డినే భవిష్యత్తులో రాహుల్ గాంధీకి ప్రధాన ఆయుధంగా అవుతాడన్న ఉద్దేశంతోనే అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. బీజేపీ పతనం మొదలైంది... ముందు అది గుర్తుపెట్టుకోండని అన్నారు..