📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి 
                                                                             జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై అధికారులు సమన్వయంతో వ్యవహరించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన దొమ్మటి సువర్ణ, దొమ్మటి అర్జున్ లు తాము 2015లో భూమి క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డి.డి. తీశామని, ఇట్టి మొత్తాన్ని 2022లో ప్రభుత్వం అమలు చేసిన జి.ఓ.59 కు బదలాయించి తమ భూమిని క్రమబద్ధీకరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం సంపత్ జాతీయ రహదారి 63 విస్తరణలో తన భూమి, గదులు పోతున్నాయని, పరిహారంతో పాటు భూమిని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లక్షెట్టిపేట మండలం సూరారం గ్రామానికి చెందిన తాటిపర్తి రమాదేవి గ్రామంలోని ఇండ్లను క్షేత్రస్థాయిలో విచారించి ఇంటి పన్ను నిబంధనల ప్రకారం విధించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జనసేన పార్టీ ప్రతినిధులు ఆవుల సాగర్ జిల్లాలోని మందమర్రి - లంబడితండా మార్గంలో గల పెద్దవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ అర్జీ సమర్పించారు. తాండూర్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గుడెల్లి యశోద తమ తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూములకు ఉమ్మడి వారసులుగా ఉన్నామని, తమకు తెలియకుండా ఉమ్మడి భూముల క్రయవిక్రయాలు జరుపకుండా నిలుపుదల చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మంత్రి సురేఖ ప్రభుత్వం ఉత్తర్వులు 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ కొరకు చేసుకున్న దరఖాస్తును పరిశీలించి క్రమబద్ధీకరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 18 దరఖాస్తు వచ్చాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కార చర్యలు వేగవంతం చేసి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.