మండలంలో ఘనంగా భోగి దీపావళి పండుగ పూజలు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో భోగి దీపావళి పండుగలను ప్రజలు అంగరంగ వైబవంగా భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. భోగి దీపావళి పండుగలు ఒక్కోరోజు వస్తుంటాయి కాని ఈ సంవత్సరం ఒకేరోజు ఉదయం భోగి రాత్రి దీపావళి రావడంతో ఉదయం నుండే ప్రతి ఇంటిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసుకున్నారు. భోగి పండుగ సందర్బంగా ఆడపడుచులు భర్తలకు తండ్రులకు సోదరులకు హారతి ఇస్తారు అదేవిదంగా దీపావళి సందర్బంగా వ్యాపారస్తులతోపాటు కొందరు నివాసాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజలు చేసుకుంటారు. ఈ సందర్బంగా మండలకేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో పండుగ కార్యక్రమాలు వైబవంగా జరుపుకున్నారు. అదేవిదంగా మండలకేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆలయ పురోహితులు దీపావళి పండుగను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేఖలు అర్చనలు చేశారు. భక్తులు ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
