నూతన రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
- 3.60 కోట్ల సి ఆర్ ఆర్ నిధులతో నిర్మాణం
- అలూర్ నుంచి ధని గ్రామం వరకు నూతన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని అలూర్ గ్రామం నుంచి ధని గ్రామం వరకు సీఆర్‌ఆర్ (CRR) నిధులు రూ.3 కోట్ల 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం తగ్గి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇర్ల చిన్నయ్య, సారంగాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు కల్వ నరేష్, మండల ఉపాధ్యక్షులు ఇర్ల విజయ్, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, జమాల్, భూమయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
