అరుణాచలం గిరి ప్రదక్షిణకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు
- నవంబర్ 23న నిర్మల్ నుంచి ప్రత్యేక యాత్ర ప్రారంభం.. రానుపోను కలిపి రూ.5,220 టికెట్ ధర
పుణ్యక్షేత్రాల దర్శనం చేయాలనుకునే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది. నిర్మల్ డిపో ఆధ్వర్యంలో తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు పలు ప్రసిద్ధ ఆలయాల దర్శనం కోసం ప్రత్యేక బస్సు యాత్రను ఏర్పాటు చేసింది.
ఈ నెల 23వ తేదీన నిర్మల్ డిపో నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. ఈ యాత్రలో కాణిపాకం, అరుణాచలం, కాంచీపురం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ తెలిపినారు.భక్తుల సౌకర్యార్థం రానుపోను కలిపి టికెట్ ధరను రూ.5,220గా నిర్ణయించారు. సర్వీస్ నంబర్ 99968 కాగా, బస్సు బయలుదేరే సమయం మధ్యాహ్నం ఒంటి గంటగా ప్రకటించారు.యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా www.tgsrtbus.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 9959226003, 9440018549 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చనీ తెలిపినారు.
ఆధ్యాత్మిక యాత్రలపై ఆసక్తి ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపి మేనేజర్ కోరుతున్నారు.
