నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : భాగ్యనగరంలో డిసెంబర్ 12న నిర్వహించే అయ్యప్ప కోటి నామార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథం ఆదివారం ఇందూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి అయ్యప్ప స్వామి కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అయ్యప్ప స్వామి నామాన్ని కోటి సార్లు జపించే బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పేర్కొన్నారు. మాలధారణ చేసిన ప్రతి అయ్యప్ప స్వామికి మంచి అవకాశం అన్నారు. ఇందూరు నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రచార రథంతో పాటు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మఠం పవన్, ఆగమయ్య గురుస్వామి, పార్శి రాజేందర్, రాజేష్ స్వామి, అయ్యప్ప సేవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer
Advertisement