📅 Sunday, 01 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
30°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష
‹
›
District News

అక్రమ ఇసుక రవాణాపై బీజేపీ నాయకుల ఆందోళన

◉ Kodishetti Sathish   |   ◷ Latest
అక్రమ ఇసుక రవాణాపై బీజేపీ నాయకుల  ఆందోళన
చెన్నూరు సాక్షర : చెన్నూర్
తలాపునే గోదావరి నది ఉన్నప్పటికీ, స్థానిక గ్రామీణ మరియు పట్టణ ప్రజలు ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. చెన్నూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకట నర్సయ్య మాట్లాడారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోదావరి నది నుండి పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటి నిర్మాణాలకై ఉచితంగా ఇసుకను తీసుకోవడానికి స్పష్టమైన జీవోలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను తుంగలో తొక్కి, వేరే ప్రాంతాలకు ఇసుకను అమ్ముకుంటోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గతంలో గోదావరి నది నుండి సింగరేణికి ఇసుకను తరలించవద్దని పట్టణ ప్రజలు అడ్డుకున్న ఘటనలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాఖాలోనే అక్రమ ఇసుక రవాణా సాగుతోందని, దీనికి సంబంధించి అనేకసార్లు పోలీసులు కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించి నియోజకవర్గ వాసులకు ఉచితంగా ఇసుకను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమం లొ పలువురు బీజేపీ నేతలు పాలొగొన్నారు