📅 Sunday, 01 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
30°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష
‹
›
District News

ప్రశస్త యాప్ వినియోగంపై ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ప్రశస్త యాప్ వినియోగంపై ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం
  • ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తొలిదశలోనే గుర్తించి నాణ్యమైన విద్య అందించాలి.జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్
నిర్మల్ నవంబర్ 1 సాక్షర ప్రతినిధి
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి, వారికి తగిన విద్యా సహాయం అందించడమే లక్ష్యంగా (PRASHAST) ప్రాథమిక సమగ్ర పరిశీలన సాధనం
(Pre-Assessment Holistic Screening Tool) యాప్‌పై జిల్లా స్థాయి ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో నిర్వహించారు. ప్రభుత్వ విద్యాశాఖ, సమగ్ర శిక్ష నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో IERPs, ప్రత్యేక ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ప్రతి విద్యార్థికి సమాన విద్యావకాశాలు కల్పించడం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తొలిదశలోనే గుర్తించి వారికి తగిన విద్యా సహాయం, అవసరమైన సేవలు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. సమ్మిళిత విద్య బలోపేతానికి ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని సూచించారు.
జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తిరిగి మండల స్థాయిలో అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు అర్ధరోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. కాబట్టి ఇక్కడ అందించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకొని, మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తుకారాం, జిల్లా రిసోర్స్ ఉపాధ్యాయులు దయానంద్, రాజశేఖర్, సునీల్, నరేష్, వినోద్‌తో పాటు ఉపాధ్యాయులు, IERPs, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.