📅 Saturday, 31 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహానుభావులు వల్లభ్ భాయ్ పటేల్ * నివాళులర్పించిన ఎంపి ధర్మ పూరి ఆర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్,
‹
›
District News

కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల మద్దతు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
  • అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి
నిర్మల్ అక్టోబర్ 31(సాక్షర ప్రతినిధి)
భైంసా పురపాలక సంఘ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ అమలుపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాపై పలువురు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు శనివారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీజీఈజేఈసీ, పెన్షనర్ల సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను కలిసి తమ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ....... రాష్ట్రస్థాయిలో నిజాయితీ, నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందిన కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ముఖ్యంగా భైంసా పట్టణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న కలెక్టర్‌కు ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని స్పష్టం చేశారు.కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించినా, భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీజీఈజేఈసీ గౌరవాధ్యక్షుడు ఎం.సి. లింగన్న, ఛైర్మన్ వి. ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పి.సి. రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి రమేష్, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవికుమార్, పెన్షనర్ల సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.