📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Mainly clear
⚡ MORE NEWS డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
‹
›
District News

ఆసరా ఫెన్షన్ లలో అవకతవకలు విచారణపై యం పి డి ఓ కు పిర్యాదు

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఆసరా ఫెన్షన్ లలో అవకతవకలు విచారణపై యం పి డి ఓ కు పిర్యాదు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో ఇటివల మంజురైన ఆసరా ఫెన్షన్ లలో అవకతవకలు జరిగాయని విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలనీ గ్రామ ఉప సర్పంచ్ వినయ్ మండల పరిషత్ అబివృద్ది అధికారికి పిర్యాదు చేసినట్లు అయన తెలిపారు. సోమవారం రోజున అయన గ్రామంలోని బాదితులతో కలిసి మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో యం పి డి ఓ ఉమర్ షరీఫ్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక బరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆసరా ఫెన్షన్ పథకం ప్రవేశపెడితే మా గ్రామంలో అధికారులు అనర్హులను ఎంపికచేసి అర్హులకు మొండి చేయి చూపారని ఈ విషయంలో అధికారులను ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వడంలేదని అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలి కోరుతూ బాదితులతో కలిసి ఈరొజు యం పి డి ఓ కు పిర్యాదు చేసినట్లు అయన తెలిపారు.