📅 Monday, 23 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఆరు నెలల శిక్షణ నిమిత్తం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 4 డి.యస్.పి లు – పోలీస్ కమిషనర్‌కు రిపోర్ట్
‹
›
District News

డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
డిసెంబర్ 15 లోపు నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేయాలి
  • టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కె. వరుణ్ రెడ్డి, ఐఏఎస్
వ్యవస్థను మరింత పటిష్టం చేసి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నిర్మిస్తున్న నూతన ఇండోర్ సబ్ స్టేషన్ పనులను డిసెంబర్ 15, 2026 లోపు అన్ని విధాలుగా పూర్తి చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కె. వరుణ్ రెడ్డి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిజామాబాద్ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను సీఎండీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులు, విద్యుత్ పరికరాల ఏర్పాటు, కేబుల్స్ వేయడం, పరీక్షలు నిర్వహించడం తదితర పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో సబ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ ఆపరేషన్ అశోక్ కుమార్, ఎస్ఈ పివి. రాజేశ్వర్ రావు, డీఈలు వెంకటరమణ, ఎం.డి. ముఖ్తార్, ఏడీఈలు తోట రాజశేఖర్,వినోద్, సాయి తేజ, ఏఈలు కాశీనాథ్, గంగాశేఖర్, కార్తీక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.