అయ్యప్ప దయతోనే ఎమ్మెల్యేగా గెలిచాను : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : అయ్యప్ప దయతోనే తాను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని ఏడవ డివిజన్లో, మాకూరు మండలం మాదాపూర్ లో అయ్యప్ప పడిపూజ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం ఇందూరులో అయ్యప్ప మాలాదారులు పెరుగుతున్నారన్నారు. యువత భక్తి మార్గం వైపు నడుస్తున్నారని పేర్కొన్నారు. 41 రోజుల మండల దీక్ష మనిషిలో ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, సాత్విక ఆహారం వైపు నడిపిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, రాజేష్ స్వామి, అనిల్ స్వామి, రఘువీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
