పంటనీటికై రోడ్డెక్కిన అన్నదాత
పంటకు నీరు అందించండి మహాప్రభో అంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. బుదవారం రోజున మండలంలోని చింతగూడ గ్రామ ప్రాంత అన్నదాతలు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా జన్నారం మండల పరిషత్ తాజా మాజీ ఉపాధ్యక్షులు సుతారి వినయ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో పంటలు నీరు అందక ఎండిపోయే ప్రమాదం వున్నదని కడెం ఆయకట్టు నుండి దిగువన వున్న చివరి పంటల వరకు నీరు అందించాలని అధికారులను కోరారు. పంటలు పొట్ట దశకు వచ్చిన సమయంలో ఆయకట్టు నీరు నిలిపివేయడం సరైంది కాదని పంటలు పూర్తి అయ్యేంతవరకు నీటిని అందించాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ ఐ ఉదయ్ కిరణ్ రాస్తారోకో వద్దకు వెళ్లి మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకేలతానని రైతులను సముదాయించి రాస్తారోకో విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
