డంపింగ్ యార్డును సందర్శించిన కలెక్టర్ - బయో మైనింగ్ ను వేగవంతం చేయాలని ఆదేశం*
- రోడ్లపై పశువులను వదిలితే.. కేసులు పెట్టండి
ప్రతి రోజు సగటున 600 మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ జరుపుతుండగా, దానిని వెయ్యి మెట్రిక్ టన్నులకు పెంచాలని కలెక్టర్ సూచించారు. డంపింగ్ యార్డు ప్రాంతంలో ఖాళీ స్థలాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించాలని అన్నారు. డంపింగ్ యార్డు ప్రాంతం అంతా కవర్ అయ్యేలా సోలార్ ప్యానెల్స్ తో పని చేసే సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వ్యర్థాల శుద్ధి ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు ప్రదేశంలోని రోడ్డుకు ఆనుకుని ఇరువైపులా వ్యర్థాలను పోగు చేయకుండా దూరంగా తరలించాలని అన్నారు.
*రోడ్లపై పశువులను వదిలితే కేసులు నమోదు చేయండి*
రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. డంపింగ్ యార్డు ప్రాంతంతో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై ఆవులు, ఇతర పశువులు ఎక్కడబడితే అక్కడ సంచరిస్తుండడం గమనించిన కలెక్టర్ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై పశువుల సంచారం వల్ల వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లపై పశువులను వదిలితే కేసులు నమోదు చేయాలని, జరిమానాలు విధించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
