డీసీఎంఎస్ ఇంచార్జి చైర్‌పర్సన్‌గా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ బాధ్యతల స్వీకరణ
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 04 : నిజామాబాద్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఇంచార్జి చైర్‌పర్సన్‌గా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజాగౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీసీఎంఎస్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రైతులకు సహకార రంగం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వారికి సూచించారు.
