📅 Wednesday, 04 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☂
30°C Adilabad, Telangana
Light drizzle
⚡ MORE NEWS డీసీఎంఎస్ ఇంచార్జి చైర్‌పర్సన్‌గా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ బాధ్యతల స్వీకరణ
‹
›
District News

ఎంపీ అర్వింద్ చొరవ, పట్టుదలవల్లే ఆర్వోబీ నిధుల మంజూరీకి లభించిన అనుమతి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
  • మాధవ్ నగర్ ఆర్వోబీ వద్ద ఎంపీ ధర్మపురి అర్వింద్ చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 3: ఎంపీ అర్వింద్ చొరవ, కృషి వల్లే ఆర్వోబీ నిర్మాణం సాకారమైందని నిరంతరం పోరాడి నిధులు మంజూరు చేయించినందుకు ఎంపి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించి, ఆయన కృషిని కొనియాడారు. మంగళవారం నిజామాబాద్ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ నిరంతరం పోరాడి, నిధులు మంజూరు చేయించారని మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ అన్నారు. మాధవ్ నగర్ ఆర్వోబీ వద్ద ఎంపీ ధర్మపురి అర్వింద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, ఆయన కృషిని కొనియాడారు. ఎంపీ అర్వింద్ చొరవ, కృషి వల్లే ఆర్వోబీ నిర్మాణం సాకారమవుతోందని ప్రమోద్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐదో డివిజన్ కార్పొరేటర్ నరేష్, బీజేపీ కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.