బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు.
- విద్యార్థుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తక్షణమే వీడాలి – ప్రభుత్వం బాధ్యత వహించాలి. జగన్ మోహన్ బిఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు..........
బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న వేలాది మంది పేద,మధ్యతరగతి విద్యార్థుల ఆరోగ్యం,భద్రత విషయంలో నెలకొన్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ పాలనా నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. విద్యార్థులకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం,సరైన వసతి సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఏర్పడటం అత్యంత బాధాకరం.
విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యాసంస్థలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆందోళన చెందాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? విద్యార్థుల తాగునీరు, ఆహారం, వసతి వంటి కనీస అవసరాలను తీర్చడం కూడా ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదా!?
బాసర ట్రిపుల్ ఐటీ కేవలం ఒక విద్యాసంస్థ కాదు. వేలాది పేద బహుజన కుటుంబాల ఆశలు,పేదప్రజల ఆకాంక్షలకు ప్రతీక. అలాంటి సంస్థలో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులు ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలు ఎందుకు తక్షణ చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారు.ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి,ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా బాధ్యతతో స్పందించాలనీ విద్యార్థుల సమస్యలపై ప్రకటనలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో పరిష్కారాలు చూపించాలని అన్నారు.
విద్యార్థులకు ఏదైనా తీవ్రమైన అనారోగ్యం సంభవించినా, ప్రాణనష్టం జరిగినా బాధ్యత ఎవరిది? ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అని విమర్శించారు. విద్యార్థుల ప్రాణాల విషయంలో ఇకపై కాలయాపనకు తావులేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి బిఎస్పీ నిర్మల్ జిల్లా అద్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ చేశారు.
