📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS సింగరేణి కార్మికుల హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం,ఏఐటియుసి.
‹
›
District News

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
  • తూనికలు – కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు.. రెండు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు
నిర్మల్ పట్టణంలోని పలు వ్యాపార సంస్థల్లో శుక్రవారం లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించిన రెండు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా అధికారి పి. శంకర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపార సంస్థల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, కాంటా బాట్లు తదితర తూనిక పరికరాలకు నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా స్టాంపింగ్ చేయించుకోవాలని సూచించారు. అలాగే వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రయించే వ్యాపారులు సంబంధిత నిబంధనల ప్రకారం ప్యాకింగ్ లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు.వినియోగదారులకు సరైన తూనికలు, కొలతలతో వస్తువులను విక్రయించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను నిర్లక్ష్యం చేసినా, ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని వ్యాపారులందరూ లీగల్ మెట్రాలజీ నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారాలు నిర్వహించాలని పి. శంకర్ సూచించారు.