📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS అలీ సాగర్ ఫిల్టర్ బెడ్ వద్ద పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనుల కారణంగా శనివారం నిజామాబాద్ నగరానికి మంచినీటి సరఫరా
‹
›
District News

సింగరేణి కార్మికుల హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం,ఏఐటియుసి.

◉ M VIJAYA   |   ◷ Latest
సింగరేణి కార్మికుల హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం,ఏఐటియుసి.
  • టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి.
రెబ్బెన,సాక్షర:సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలలో అన్యాయం చేసిందని దానికి తోడు ఏఐటియుసి నమ్మించి మోసం చేసిందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి దుయ్యబట్టారు.శుక్రవారం బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పి,ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయంలో సింగరేణి కార్మికులకు తండ్రి కొడుకుల ఉద్యోగం,తెలంగాణ ఇంక్రిమెంట్,ఉచిత విద్యుత్తు,గృహా నిర్మాణానికి 10లక్షల రూపాయల వడ్డీ లేని రుణం,తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం లాంటి ఎన్నో హక్కులు సాధించామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు ఊడగోడుతున్నదని,మెడికల్ బోర్డు బంద్ చేసిందన్నారు.ఏఐటియుసి యూనియన్ సమ్మె పేరిట నాటకాలు ఆడి ఒప్పందం చేసుకున్నామని చెప్పి కార్మికులను మభ్యపెట్టిందని ఆరోపించారు.మరోసారి ధర్నాల పేరిట కార్మికులను మోసం చేస్తున్నదని,12వ వేతన ఒప్పందం కాలం ప్రారంభం అయ్యి నాలుగు నెలలు గడచినప్పటికీ ఒప్పంద కమిటీని నియమించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.గత దశాబ్దాలుగా సింగరేణి కార్మికులను జాతీయ సంఘాలు మాయ మాటలు చెప్పి అరచేతులో వైకుంఠం చూపెట్టి తమ పబ్బం గడుపుకున్నాయన్నారు. ఇప్పటికైనా కార్మికులు వాస్తవాలు గ్రహించి రానున్న సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ కు పట్టం కట్టాలని,కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్,టీబీజీకేఎస్ ద్వారా మాత్రమే కార్మికుల హక్కులు సాధ్యమని అన్నారు.గోలేటి సిహెచ్పి ఫిట్ సెక్రటరీ మర్రి సమ్మయ్య,జిఎం ఆఫీస్ ఫిట్ కార్యదర్శి గడ్డం రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి,బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోలేటి సిహెచ్పి,జిఎం కార్యాలయంలో దుండ్రా రవి కుమార్,శారదా,పిట్టల సదయ్య,సురేష్,వెంకటకృష్ణ,సాయి ప్రసాద్,స్రవంతి మల్లికార్జున్,ఇలియాస్, సత్యనారాయణ,ఓదెలు తదితరులు టీబీజీకేఎస్ యూనియన్ లో చేరారు.కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిరి శెట్టి సత్యనారాయణ,చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ,ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు,ఓరం కిరణ్,సెంట్రల్ కమిటీ నాయకులు సంపతీ తిరుపతి,రామగిరి శ్రీనివాస్,వెంకటేష్,సంగి ప్రశాంత్,మెరుగు రమేష్ మహిళా నాయకురాలు వరలక్ష్మి,జ్యోతి,అర్చన,అనూష,జిఎం ఆఫీస్ అసిస్టెంట్ ఫీట్ కార్యదర్శి మంకయ్య,కలీముల్లా అరుణ్,ఏరియా నాయకులు వంగ మహేందర్ రెడ్డి,గొల్ల కృష్ణ, విద్యాసాగర్,రమేష్,మురళి కృష్ణ,శ్రీనివాస్,రమేష్,చిరంజీవి,కార్మికులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.