కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కు తరలి రావాలని పిలుపు
సాక్షర (బోథ్): ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని కొమ్రామ్ భీమ్ విగ్రహ ఆవిష్కరణ నవంబర్ ఒకటీ నా, రాయ్ సెంటర్ లో కుమ్రామ్ భీమ్ విగ్రహ ఆవిష్కరణ చేసి, అక్కడ నుండి ర్యాలీ తో బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కుమ్రామ్ భీమ్ విగ్రహ ఆవిష్కరణ చెయ్యడం జరుగుతుంది. కావున ఉద్యోగులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఆదివాసీ సంఘ నాయకులు, అందరు తొమ్మిది తెగల ఆదివాసులు భారీ పెద్ద ఎత్తున విగ్రహా ఆవిష్కరణ కోసం తరిలి, ఆదివాసీ ప్రధాన్ సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉయిక సుదర్శన్ ఎఫ్ టి ఎస్ అవార్డు గ్రహీత రావాలని కోరారు. కుమ్రామ్ భీమ్ విగ్రహ ఆవిష్కరణ కు భారీ పెద్ద ఎత్తున అందరు రావాలని తెలిపారు .
