📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS సింగరేణి కార్మికుల హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం,ఏఐటియుసి.
‹
›
District News

విద్యార్థులు బాలల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
విద్యార్థులు బాలల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
  • వాసవి పాఠశాలలో పోక్సో చట్టం–2012పై అవగాహన సదస్సు.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు సైబర్ వేధింపులపై విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పొరిక రవీందర్
నిర్మల్ అక్టోబర్ 30 సాక్షర ప్రతినిధి. బాలల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి పొరిక రవీందర్ సూచించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ – బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం–2012 పై అవగాహన సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన పాఠశాల స్థాయి అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బాలల రక్షణ, హక్కులు, చట్టపరమైన అంశాలపై వివరించారు.ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, వ్యక్తిగత ఫొటోలు, వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే ప్రమాదం ఉందని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పెద్దలకు తెలియజేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వాసవి విద్యా సంస్థల కరస్పాండెంట్ పోతారెడ్డి, న్యాయవాదులు జి. నరేంద్రనాథ్, బి. సాయికుమార్, ఎం.డి. సిరాజ్ కైసర్, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.