చిన్నారి నిధ్యానకు ఎమ్మెల్యే అభినందనలు.. మామడలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ
- చేయూత పింఛన్ల పంపిణీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన నిధ్యానకు సన్మానం లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ జిల్లాకు చెందిన చిన్నారి నలం నిధ్యాన తన అసాధారణ ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి 'ఐబీఆర్ అచీవర్' బిరుదు పొందడం అభినందనీయమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చిన్నారి నిధ్యాన ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు.
కేవలం 5 సంవత్సరాల 1 నెల వయస్సులోనే రెండు చేతులతో విడివిడిగా ఇంగ్లీష్ పెద్ద, చిన్న అక్షరాలు, తెలుగు అచ్చులు, హిందీ అచ్చులు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను కేవలం 10 నిమిషాల్లో రాసి తన ప్రతిభను చాటుకోవడం విశేషమని ఎమ్మెల్యే కొనియాడారు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నిధ్యాన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తల్లిదండ్రులతో పాటు నిర్మల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మామడలో నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ..........
మామడ మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంజూరు ఉత్తర్వులను అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడం ద్వారా వారి జీవితాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రామ్‌నాథ్, జమాల్, రమణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మామడ మండల అధ్యక్షులు రంజిత్ కుమార్, సర్పంచులు సురేందర్, సచిన్, రాజేశ్వర్, రూప్సింగ్, తిరుపతి, రమేష్, అశ్విన్ రెడ్డి, మల్లేష్, మల్లయ్య, మండల నాయకులు బాపురెడ్డి, కొండ్రా రాజరెడ్డి, రమణ, గోవర్ధన్, వెంకటేష్, జాలం నాయక్, నరేష్, నరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ తదితరులతో పాటు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
