📅 Sunday, 22 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
‹
›
District News

ఫ్యాన్సీ నంబర్ల ఎంపిక గడువు 60 రోజుల నుంచి 30 రోజులకు కుదింపు.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
  • నవంబర్ 19 నుంచి కొత్త నిబంధనలు అమలు.. వాహన యజమానులు గడువులోగా రిజర్వేషన్, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి
నిర్మల్, నవంబర్ 19 సాక్షర ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కేటాయింపు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఫ్యాన్సీ నంబర్లను పొందాలనుకునే వాహన యజమానులకు ఇప్పటివరకు ఉన్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించింది.ఈ నూతన నిబంధనలు నవంబర్ 19, 2026 నుంచి అమల్లోకి వస్తాయని రవాణా శాఖ ప్రకటించింది.కొత్త వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ (TR) జారీ అయిన తేదీ నుంచి 30 రోజులలోపు సంబంధిత రిజర్వేషన్,బిడ్డింగ్ (వేలం),చెల్లింపు ప్రక్రియలను పూర్తి చేసి తమకు నచ్చిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాలని సూచించింది.గడువులోగా ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులో జాప్యాన్ని నివారించవచ్చని రవాణా శాఖ పేర్కొంది. వాహన యజమానులు ఈ నూతన నిబంధనలను గమనించి నిర్ణీత సమయంలోగా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.