📅 Sunday, 25 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS బీరంగూడలో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన
‹
›
District News

అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
బీహెచ్ఈఎల్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్రను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ఆదివారం ఉదయం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు ఈ మహా పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి మాలధారణ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోవడంలో ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పట్ల అచంచలమైన భక్తిశ్రద్ధలతో చేపట్టే పాదయాత్ర భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని తెలిపారు. శబరిమల యాత్రను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో కొనసాగిస్తూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వామి మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.