సదర్ సమ్మేళనం నవంబర్ 10.. దీపావళి నవంబర్ 8..
- గ్రామ పెద్దలు, అన్ని కులాల నాయకుల సమక్షంలో తేదీలు ఖరారు
ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో ముందుకు రావాలని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సదర్ ఉత్సవాల నిర్వహణకు సీఎంసీ ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కురుమ సగం అధ్యక్షుడు తంట నరసింహ, బైకన్ నవీన్ యాదవ్, మల్లేష్, సుధాకర్, ఐలాపురం ఆయిలేష్ , సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ కులాల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
