- శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.. మహా రుద్రాభిషేకంలో పాల్గొన్న హరీశ్ రావు
- అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో భోజనం
అమీన్పూర్: రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆదివారం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా బీరంగూడలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter