- పటాన్‌చెరులో SIRపై బీజేపీ మేధావుల సమావేశం
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి
పటాన్‌చెరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన పటాన్‌చెరులోని మున్నూరు కాపు హాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–SIR)పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా ప్రాధాన్యతను వివరించారు. SIR ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు సక్రమంగా అందేలా చూడటంతో పాటు, ఓటరు జాబితా ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్, జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, మేధావుల విభాగం కన్వీనర్ వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు, కుమార్, దేవేందర్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, విద్యావంతులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter