చెరువుల పూడికతీత పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
- ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల నాణ్యత, పురోగతిపై అధికారుల ఆరా
నిర్మల్ జిల్లాలోని పాక్‌పట్ల, గాంధీనగర్ గ్రామాల్లో వికసిత్ భారత్ జీ రామ్ జీ (VB-G RAM G) విబిజీ రాంజీ పథకం కింద చేపడుతున్న చెరువుల పూడికతీత పనులను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,ఉపాధి హామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువుల్లో చేపడుతున్న పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి,పనుల నిర్వహణ తీరును సమీక్షించారు. ప్రభుత్వ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని,గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధికి చెరువుల పూడికతీత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాపట్ల, పాక్‌పట్ల సర్పంచ్ శ్రీలత,గాంధీనగర్ సర్పంచ్ ఆమని బసవరాజ్, గ్రామాల సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
