కంబాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 21, (సాక్షార)
పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు కావడంతో గ్రామ సర్పంచ్ సుజాత శ్రావన్ దేశాయ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర అంజవ్వ, గ్రామ పంచాయతీ కార్యదర్శి అంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
