- ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపు
నిర్మల్ నవంబర్ 7 సాక్షర ప్రతినిధి. 11న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు గర్జన సభకు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.సమావేశంలో జాన్సన్ నాయక్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి గ్రామం నుంచి జనసమీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ గళాన్ని వినిపించేందుకు రైతులు సైతం పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు.సభ విజయవంతం కావడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేస్తూ సమిష్టిగా కృషి చేయాలని భూక్యా జాన్సన్ నాయక్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer