రెబ్బెన,సాక్షర:డిజిటల్ సర్టిఫికేట్ కాంపెయిన్ 5.0 కార్యక్రమంలో భాగంగా విశ్రాంత సింగరేణి ఉద్యోగులకు రెండు రోజుల పాటు గోలేటిలోని బెల్లంపల్లి ఏరియా జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో సీఎంపిఎఫ్,సిపిఆర్ఎంఎస్ రినివల్ చేసుకోవడం పై అవగాహన కల్పించనున్నట్లు జనరల్ మేనేజర్ ఎం.శ్రీరమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇప్పటివరకు విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ రినివల్ కోసం జీవన్ ప్రమాన్,వైద్యసేవల కోసం హెల్త్ కార్డు రినివల్ ను మీసేవ కేంద్రాల్లో మాత్రమే చేసుకుంటున్నారని.కాగా ఇప్పటినుండి మీసేవా కేంద్రాల్లో మాత్రమే కాకుండా ఇంట్లో తమ ఫోన్ లోనే రినివల్ చేసుకోవడం పై ఈ నెల 16,17తేదీలలో ఉధయం 10గంటల నుండి మధ్యాన్నం 1గంట వరకు జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో సీఎంపిఎఫ్,సింగరేణి అధికారులు అవగాహన కల్పించనున్నారని తెలిపారు.విశ్రాంత సింగరేణి ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఏడాది ఇంటివద్దనే సిఎంపిఎఫ్,సిపిఆర్ఎంఎస్ రినివల్ చేసుకోవడం నేర్చుకోవాలని కోరారు.అవగాహన కార్యక్రమానికి వచ్చే వారు ఆధార్,జీవన్ ప్రమాన్,సిపిఆర్ఎంఎస్ ప్రతులను తమ వెంట తీసుకువస్తే వెంటనే రినివల్ చేస్తారని జిఎం తెలిపారు.
— M VIJAYAREBBENA REPORTER