📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS విశ్రాంత సింగరేణి ఉద్యోగులకు అవగాహన.
‹
›
District News

మలక్ చించోలి ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
మలక్ చించోలి ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు
  • 30 మంది వాహనదారులకు జరిమానాలు.. మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురిపై కేసులు నమోదు
నిర్మల్,నవంబర్ 14 సాక్షర ప్రతినిధి
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు సారంగాపూర్ మండల పరిధిలోని మలక్ చించోలి ఎక్స్‌ రోడ్డు వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించామణి సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపినారు.ఈ తనిఖీల సందర్భంగా సరైన వాహన పత్రాలు లేని 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగుతుందని హెచ్చరించారు. వాహనదారులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఎస్సై శ్రీకాంత్ తో పాటు పోలీసులు కోరారు.