📅 Saturday, 14 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
25°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
‹
›
District News

కమిషనర్ హామీతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె తాత్కాలిక విరమణ.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
కమిషనర్ హామీతో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె తాత్కాలిక విరమణ.
  • 33 రోజుల నిరవధిక సమ్మెకు తాత్కాలికంగా తెర.. పది ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.. మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తామని హామీ
నిర్మల్ నవంబర్ 14 సాక్షర ప్రతినిధి.
నిర్మల్ జిల్లాలో గత 33 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తాత్కాలికంగా తెరపడింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు ఉద్యోగులు సమ్మెను తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించారు. రేపటి నుంచి తిరిగి విధుల్లో చేరి ప్రజలకు వైద్య సేవలు అందించనున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.కమిషనర్ ఇచ్చిన హామీని గౌరవిస్తూ, ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. రేపటి నుంచి ఉద్యోగులందరూ తిరిగి విధుల్లో చేరి ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చే వరకు తమ డిమాండ్ల పరిష్కారంపై అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు.33 రోజుల సమ్మె కాలంలో తమకు సహకరించిన ప్రజలకు, పత్రికా ప్రతినిధులకు, వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, సమన్వయకర్త బొజ్జ రమణ, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ రమేష్, యోత్సేనతో పాటు నాయకులు సుజాత, శోభ, నుస్రత్, రాధ, వెంకట రమణ, జైపాల్, వంశీ, భోజన్న, భువన, వినీత, గంగమణి పద్మ తదితరులు పాల్గొన్నారు.